
టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ వారసుడు .. మంచు విష్ణు హీరోగా తన లైఫ్ టైం పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా గా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కన్నప్ప. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఈవెనింగ్ షోలకే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో టాప్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించడంతో కన్నప్ప సినిమా చూసేందుకు అన్ని భాషల ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.
ఇక కన్నప్ప ఇప్పటికే తెలుగులో సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. నార్త్ మార్కెట్ లో కన్నప్ప పరిస్థితి ఏంటన్నది అందరిలోనూ సహజంగానే ఆసక్తి రేపింది. నార్త్ ఇండియా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డే 1 కంటే 2 వ రోజు హిందీ లో ఏకంగా 40 శాతం జంప్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో మొదటి రోజు వసూళ్ల కంటే రెండో రోజు ఈ సినిమా బెటర్ పెర్పామ్ చేసిందనే చెప్పాలి. అధికారిక నెంబర్లు మాత్రం బయటకు రావాలి. ఇక బాలీవుడ్ నుంచి బిగ్ స్టార్ అక్షయ్ కుమార్ మహా శివుడు పాత్రలో కనిపించడం కూడా ఈ సినిమా కు నార్త్ లో చాలా ప్లస్ అయ్యింది. ఆదివారం కూడా బుకింగ్స్ అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు