ప్రముఖ యాంకర్ గా పేరు పొందిన స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటన ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో కొంతమేరకు ఉలిక్కిపాటికి గురిచేసింది. అయితే ఈమె ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు మొదటి నుంచి అనుమానాలు పోలీసులకు కనిపిస్తూనే ఉన్నాయి. పూర్ణచందర్ వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. పూర్ణచందర్ స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరి మోసం చేసినట్లుగా అధికారులు తెలియజేశారు. అయితే ఈ మోసాన్ని ఆమె గ్రహించి అతడి నుంచి స్వేచ్ఛ విడిపోదామని నిర్ణయం తీసుకునే సమయంలో పూర్ణచందర్ తో స్వేచ్ఛ గొడవ పడినట్లుగా సమాచారం.


అయితే ఇప్పుడు తాజాగా స్వేచ్ఛ ఆత్మహత్యకు మరొక కారణం అన్నట్లుగా ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. అదేమిటంటే స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పూర్ణచంద్ర పైన ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.. గతంలో తనతో కూడా చాలాసార్లు అసభ్యకరంగా పూర్ణచందర్ ప్రవర్తించారని స్వేచ్ఛ కూతురు, స్వేచ్ఛ తండ్రి  నిన్నటి రోజున మీడియాతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి స్టేట్మెంట్ ఇచ్చారు. తన తల్లితో పాటుగా తనని కూడా వేధించేవారు అంటూ పలు సంచలన ఆరోపణలు చేసింది స్వేచ్ఛ కూతురు. దీంతో అతనిపైన ఫోక్సో కేస్ నమోదు అయినట్లుగా అధికారులు తెలియజేశారు.


స్వేచ్ఛ ఆత్మహత్యకు ముఖ్య కారణం పూర్ణచంద్ర అంటూ ఆమె కూతురు, తండ్రి పోలీసులకు ఫిర్యాదులో వెల్లడించారు. పూర్ణచంద్ర తన తరుపు లాయర్ తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం పోలీసుల సైతం పూర్ణచంద్ర ను విచారిస్తున్నట్లు సమాచారం. పూర్ణచందర్ పైన నమ్మించి మోసం చేసినందుకు , ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసినందుకు పలు సెక్షన్స్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి విచారణలో భాగంగా పూర్ణచంద్ర పైన ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: