
అయితే ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో నితిన్ అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు, అలాగే దిల్ రాజు అడిగిన ప్రశ్నలకు నితిన్ ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే దిల్ రాజు బయోపిక్ తెరపైకి వచ్చింది. `భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే ఛాన్స్ ఉందా? అందుకు తగిన కంటెంట్ మీ లైఫ్ లో ఉందా?` అని నితిన్ ప్రశ్నించగా.. `ఎందుకు లేదు.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లకు పైగా అయ్యింది. ఇన్నేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చాను. ఒకవేళ ఎవరైనా నా బయోపిక్ తీస్తే అందుకు ఖచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది` అంటూ దిల్ రాజు సమాధానం ఇచ్చారు.
ఇదే తరుణంలో మీ బయోపిక్ లో హీరోగా ఎవరు సరిపోతారు అని నితిన్ ప్రశ్నించగా.. `చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెప్పారు. సో నా బయోపిక్ లో హీరోగా నువ్వే సరిపోతావు` అని దిల్ రాజు అనడం.. వెంటనే `రాజుగారి బయోపిక్ లో హీరో నేనే` అంటూ నితిన్ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది.