
తెలుస్తున్న సమాచారంమేరకు ఈసారి షోకు కూడ నాగార్జున నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు ఈషో నిర్వాహకులు నాగార్జునతో ఈషోను నిర్వహించాల లేదంటే మరొక కొత్త సెలెబ్రెటీని ఎంపిక చేయాల అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘బిగ్ బాస్’ నిర్వాహకులు రాబోతున్న సీజన్ 9కు నాగార్జునను అధికారికంగా ఎంపిక చేయడంతో పాటు ఒక ప్రోమోను కూడ నాగార్జున వాయస్ తో విడుదలచేశారు.
ఈసారి హౌస్ మేట్స్ గా సెలెబ్రెటీస్ తో పాటుగా ఇద్దరు సామాన్యులను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈకార్యక్రమంలో పాల్గొనాలి అన్న ఆశక్తి ఉన్న సామాన్యులు తమ వివరాలను తెలియచేస్తూ ఒక చిన్న వీడియోని ‘బిగ్ బాస్’ సైట్ కు అప్ లోడ్ చేయవలసిందిగా ‘బిగ్ బాస్’ యాజమాన్యం తరఫున ప్రకటించడంతో ఇప్పుడు ఈషోలో పాల్గొనబోయే సామాన్యుడు ఎవరు అన్న ఆశక్తి బుల్లితెర ప్రేక్షకులలో బాగా పెరిగిపోతోంది.
ఇదిఇలా ఉంటే ఈషోలో పాల్గొనే హౌస్ మేట్స్ లిస్టులో తేజస్విని కల్పిక గణేష్ లతో పాటు మరికొంతమంది సోషల్ మీడియా సెలెబ్రెటీలు ‘బిగ్ బాస్’ షోకు హౌస్ మేట్స్ గా రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈషోను దసరా సీజన్ లో మొదలుపెట్టి సంక్రాంతి సీజన్ కు ఎండ్ చేయాలని ‘బిగ్ బాస్’ షో నిర్వాహకుల ఆలోచన అని అంటున్నారు. గత సంవత్సరం ముగిసిన ‘బిగ్ బాస్ సీజన్ 8’ కు రేటింగ్స్ అంతంత మాత్రంగా రావడంతో ఈసారి ‘బిగ్ బాస్ 9’ సీజన్ ను సక్సస్ చేయాలని అటు నాగార్జునతో పాటు ఇటు స్టార్ మా యాజమాన్యం కూడ చాలగట్టిగా కృషి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..