డాక్టర్ చదివి యాక్టర్ అయ్యింది మీనాక్షి చౌదరి. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి.. ప‌లు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా వచ్చిన గుర్తింపుతోనే 2019లో `అప్‌స్టార్ట్స్‌` అనే చిన్న చిత్రంతో నటిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
రెండేళ్ల గ్యాప్ అనంతరం `ఇచ్చట వాహనములు నిలపరాదు` సినిమాతో మీనాక్షి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ రిజ‌ల్డ్ ఎలా ఉన్న కూడా మీనాక్షి తనదైన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు తెలుపు తట్టాయి.
అలా 2022లో `ఖిలాడి`, `హిట్ 2` చిత్రాలతో పలకరించింది. వీటిల్లో హిట్ 2 మూవీ విజయవంతం కావడంతో మీనాక్షి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారింది. తమిళంలో సైతం అవకాశాలు తక్కించుకుంటోంది. గ‌త ఏడాది `గుంటూరు కారం`, ` లక్కీ భాస్కర్` వంటి చిత్రాల‌తో విజ‌యాలు అందుకుంది.
`సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో మ‌రో బిగ్ హిట్ కొట్టి ఈ ఏడాదిని గ్రాండ్ గా ప్రారంభించిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు జోడిగా `ఎన్‌సీ24`లో యాక్ట్‌ చేస్తోంది. అలాగే మరోవైపు నవీన్ పోలిశెట్టితో కలిసి `అనగనగా ఒక రాజు` మూవీ చేస్తుంది.
ఇక‌పోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌద‌రి.. తాజాగా మినీ డ్రెస్ లో అందాల‌ను వ‌డ్డిస్తూ కుర్ర‌కారుకు మైండ్ బ్లాక్ చేసింది. సోఫాలో కూర్చుని ఓ రేంజ్‌లో స్కిన్ షో చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అవి చూసి మీను పాప ఇంత హాట్‌గా ఉందేంట్రా బాబు అంటూ నెటిజ‌న్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: