పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 2 నిమిషాల 56 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ పవన్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. "ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసుంటావ్.. ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తావ్" "దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట" "నేను రావాలని చాలామంది దేవుడికి చాలామంది దండం పెట్టుకుంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు" లాంటి డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

ట్రైలర్ లో యాక్షన్ షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కగా  ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి.   ట్రైలర్ లో వీరమల్లు విధ్వంసం  మాములుగా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.  ట్రైలర్  బీజీఎం విషయంలో సైతం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.  నిధి అగర్వాల్ ట్రైలర్ లో కొన్ని సెకన్ల పాటే కనిపించినా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె కనిపించడం  గమనార్హం.

ఈ నెల 24వ తేదీన  ఈ సినిమా విడుదల కానుండగా   ఫ్యాన్స్ రిపీట్ మోడ్  లో ఈ ట్రైలర్ ను చూస్తున్నారు.  ఈ సినిమా ఇండియన్ సినిమాను  మరో లెవెల్ కు తీసుకెళ్లడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇతర హీరోల అభిమానులు సైతం ఈ సినిమా ట్రైలర్ గురించి  పాజిటివ్ గా స్పందిస్తున్నారు.   ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనేలా  ఈ ట్రైలర్ ఉంది.  హరిహర వీరమల్లు సినిమా   కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే  ఉంది.  హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా  తెరకెక్కుతుండటం గమనార్హం.  హరిహర వీరమల్లు  ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.  ఈ సినిమాకు టికెట్ రేట్లు  ఏ స్థాయిలో పెంచుతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: