టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత వేగంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో శ్రీ లీల ఒకరు. ఈమె కెరియర్ను మొదలు పెట్టి చాలా తక్కువ కాలమే అవుతున్న ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒకే ఒక తెలుగు సినిమా ఉంది. ఈమె ప్రస్తుతం పవన్ హీరోగా రూపొందుతున్న ఉత్సద్ భగత్ సింగ్ అనే సినిమాలో మాత్రమే హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో మొదట హీరోయిన్గా కన్ఫర్మ్ అయింది.

కానీ ఆ తర్వాత ఈ సినిమా నుండి ఈమె తప్పుకుంది. దానితో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అఖిల్ హీరోగా రూపొందుతున్న లేనిన్ మూవీలో కూడా ఈ బ్యూటీ మొదట హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆ మూవీ నుండి కూడా ఈమె తప్పుకోవడంతో ఆ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈమె వరుస పెట్టి హిందీ సినిమాలలో ఆఫర్లను దక్కించుకున్నట్లు  తెలుస్తుంది. కొంత కాలం క్రితం ఈమె అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇకపోతే మరోసారి బ్యూటీ మరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... నాగ చైతన్య హీరో గా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో ఈమెతో స్పెషల్ సాంగ్ చేయించాలి అని మూవీ యూనిట్  భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈమె ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి శ్రీ లీల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: