- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా దాదాపు నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దర్శకులు క్రిష్ జాగర్లమూడి - ఏఎం . జ్యోతి కృష్ణ సంయుక్తంగా తరికెక్కించిన ఈ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈ నెల 24న పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషలలో రిలీజ్ అవుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది తెలుగు ట్రైలర్ కేవలం 20 గంటల్లో ఏకంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో వీరతాండవం ఆడుతోంది.


ఇప్పటివరకు ఆల్ టైం రికార్డ్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ 44  మిలియన్ల కు పైగా యూత్ దూసుకుపోతోంది. ఇక 20 గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్ అంటే పవన్ వీరమల్లు వీర తాండవం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ముందు నుంచి ఈ సినిమాపై హైప్‌ కాస్త తక్కువ ఉన్నా కూడా ... ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ మరింత పెరిగింది. ఇదే ఫ్లో రిలీజ్ వరకు కొనసాగితే భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: