రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. అంచెలంచెలుగా ఎదుగుతూ పెదనాన్న పేరు నిలబెట్టాడు. ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బాలీవుడ్ ఖాన్లు, కపూర్లను కూడా డామినేట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా నిలబడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.


అలాగే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` చిత్రాలు చేస్తున్నాడు. `కల్కి 2`, `సలార్ 2` ప్రాజెక్ట్స్ కూడా ప్ర‌భాస్ లైన‌ప్ లో ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ కు నలుగురు చెల్లెల్లు అన్న సంగతి తెలిసిందే. అందులో ప్రగతి ఉప్పలపాటి ప్రభాస్ సొంత సోదరి కాగా.. ప్రసీద ఉప్పలపాటి, ప్రకీర్తి ఉప్పలపాటి, ప్రదీప్తి ఉప్పలపాటి కృష్ణంరాజు కుమార్తెలు. ప్రగతి బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌రు. సోష‌ల్ మీడియాలోనూ ఉండ‌రు.


అయితే కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇప్ప‌టికే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సోష‌ల్ మీడియాలోనూ ఈమె యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఈ ఏడాది లో గడిచిన మొద‌టి ఆరు నెలల్లో ఏమేం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ల‌వ్లీ ఫొటోలను ప్ర‌సీద పంచుకున్నారు. ఈ పిక్స్ లో ప్ర‌భాస్ చెల్లెళ్ల‌ను హైలెట్ గా నిలిచారు. ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామలా దేవి కూడా క‌నిపించారు. ప్ర‌స్తుతం ప్ర‌సీద పంచుకున్న ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: