
లోకనాయకుడు సీనియర్ హీరోయిన్ కమలహాసన్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలిసిందే. కమలహాసన్ - శృతిహాసన్ అక్షర హాసన్ తల్లి సారికకు విడాకులు ఇచ్చారు. సారికతో విడిపోయాక నటి గౌతమికి దగ్గరయ్యారు.. వాళ్ళిద్దరూ కొన్నాళ్లకు విడిపోయారు. చాలామందికి తెలియని కమల్ వ్యక్తిగత జీవితంలో మరో కోణం ఉంది. సారికతో కంటే వివాహానికి ముందు వాణి గణపతి అనే మహిళను పెళ్లాడారు. ఆమె భరతనాట్య కారిణి. అయితే వాణి గణపతి సారికకు మధ్యలో బాలీవుడ్ నటి రేఖ కూడా కమల జీవితంలో ఉన్నారని చాలామంది అంటారు. 1978లో కమల్ - వాణి పెళ్లి జరిగింది. 1981లో కమలహాసన్ తో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు రేఖ. ఆ సినిమా టైంలోనే కమల్ - రేఖ మధ్య సానిహిత్యం పెరిగిందని కొందరు చెబుతారు. ఆ సినిమా షూటింగ్ కోసం చెన్నైలోని ఒక హోటల్లో యూనిట్ అంతా అదిగింది.
కమల్ - రేఖ కూడా అదే హోటల్ లో ఉన్నారు. ఆ టైంలో హోటల్లో హోటల్‌కు కమలహాసన్ భార్య వాణి గణపతి వచ్చారట. అందరూ చూస్తుండగా పబ్లిక్ గా కమలహాసన్ను ఆమె గట్టిగా తిట్టారట. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆ సినిమా నుంచి రేఖను తెప్పించారు. ఆమె స్థానంలో మలయాళ నటి దీపను తీసుకుని షూటింగ్ ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాతే కమల్ - వాణి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అంటారు. ఆ తర్వాత సారికతో కమలహాసన్ ఎక్కువ సినిమాలు చేయటం.. ఆమెకు దగ్గర కావటం జరిగిందంటారు. కమలహాసన్ తో పెళ్లికి ముందే సారిక గర్భం దాల్చినట్టు చెబుతారు. శృతిహాసన్ గర్భంలో ఉండగానే 1988లో వాణికి అధికారికంగా విడాకులు ఇచ్చి అదే ఏడాది చివర్లో సారికను వివాహం చేసుకున్నారు కమల్. ఇలా కమల్ వ్యక్తిగత జీవితం చాలా మలుపులు తిరిగింది అని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు