"సమంత ".. చాలా చాలా స్ట్రాంగ్ ఉమెన్ .. ఎంతోమంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ .. ఎంతో మందికి చాలా అండగా నిలుస్తుంది . ఇలా సమంత అభిమానులు ఆమెను ఏ రేంజ్ లో ప్రశంసిస్తూ ఉంటారో అందరికీ తెలుసు.  సమంత లో డ్యూయెల్ షేడ్స్ ఉన్నాయ్. ఒక సైడ్ పాజిటివ్ షేడ్శ్ ఉన్నట్లే ఒక సైడ్ ఆమె పడిన బాధలు కూడా ఉన్నాయ్.  అంతక ముందు సమంతా అంటే అందరికీ పెద్ద హీరోయిన్..  ఆమె అనుకుంటే ఏదైనా సాధించగలదు .. పెద్ద ఇంటికి కోడలు అయ్యింది. ఇలా మాత్రమే అనుకున్నారు . కానీ ఇప్పుడు మాత్రం సమంత అంటే విడాకులు తీసుకున్న సరే ఇండిపెండెంట్గా బ్రతుకుతుంది అని .. భరణం కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు అని .. సమంత ను చూసి అందరూ అమ్మాయిలు నేర్చుకోవాలి అని.. సమంత అందరి అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ అని మాట్లాడుతూ ఉంటారు .


కాగా  రీసెంట్గా సమంత తన అభిమానుల మనసులను గెలిచేసింది. హీరోయిన్ సమంత తాజాగా యూఎస్ లో జరిగిన తానా 2025 కాన్ఫరెన్స్ లో పాల్గొని అక్కడ అభిమానులతో ముచ్చటించి సందడి చేసింది . తాన గురించి ఆమె తన మాటల్లో చెప్పుకొచ్చింది . ఆమె మాట్లాడుతూ.." నేను ప్రతి ఏడాది తానా గురించి వింటూనే ఉంటాను . నా మొదటి సినిమా మొదలుకొని ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుల అందరికీ చాలా చాలా థాంక్స్ . తెలుగు ప్రజలు నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు అనుకుంటున్నాను . నన్నుగా గుర్తించి నాకు గుర్తింపు ఇచ్చింది మీరే..



ఆ విషయంలో నో డౌట్ .. నేను ఏ భాషలో చేసిన ముందుగా తెలుగు ప్రజల గురించి తెలుగు అభిమానుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. అంతలా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీరు భౌగోళికంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ నా హృదయం ద్వారా ఎప్పుడు నాకు చెరువులోనే ఉంటారు " అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నింది సమంత . సాధారణంగా సమంత స్టేజిపై ఏడవదు .. కానీ ఈసారి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయింది . ఈ ఒక్క మాటతో సమంత అభిమానుల మనసులను ఫిదా చేసేసింది . సమంత అంటే ఇది అంటూ అందరూ మాట్లాడుకునేలా చేసింది . సమంతని ఇప్పుడు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కాగా సమంత - రాజ్ నిడమోరు ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  దానికి తగ్గట్లే  కూడా ఫోటోలు షేర్ చేస్తుంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ మాత్రం అఫీషియల్ ప్రకటన ఆమె నుండి రాలేదు.  మరి ఇది ఫేక్ నా..? నిజమా..?ఫ్యూచర్లో తెలుస్తుంది ఏమో చూడాలి..???

మరింత సమాచారం తెలుసుకోండి: