సినీ సెలబ్రెటీలకు ఎవరు కూడా ఎలాంటి బిరుదులు ఇవ్వరు.. వాళ్ల అభిమానులే పెట్టేసుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ అనేది మాత్రం ఒకప్పుడు సితార పత్రిక వాళ్లు కూపన్స్ పంపించేవారట ప్రతివారము.. అయితే ఆ కూపన్సులో పేర్లు పెట్టేవారు. కృష్ణ ,చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, కృష్ణంరాజు అంటూ పేర్లు పెట్టి మీరు ఎవరికి ఓటు వేస్తారో ఆ కూపన్ పై టిక్ పెట్టి పంపించాలి అంటూ.. అదంతా కూడా కౌంట్ వేసి ఇదిగో వీళ్ళు సూపర్ స్టార్ అన్నట్లుగా చూపించేవారు. అప్పట్లో అందుకే సూపర్ స్టార్ కృష్ణని ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇలాగ వరుస పెట్టి బిరుదులు ఇచ్చారు.

ఇప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నట్లుగా పేర్లు వస్తూ ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు అలాంటిదేమీ కాకుండా వేరే పేర్లతో పిలుస్తున్నారట. ఏదైతే మొన్న అనసూయ రచ్చ చేసినటువంటిది.. ది విజయ్ దేవరకొండ అంట .. ఇదేం విచిత్రం ఎక్కడ విన్నలేదు అన్నటువంటిది హైలెట్ చేసింది.  దీంతో చాలా ట్రోల్ కి గురయ్యారు. అనసూయని ట్రోల్ చేశారు ది అనేటువంటి పదానికి సంబంధించి విజయ్ దేవరకొండ కూడా ట్రోల్ చేశారు.


అయితే తన పేరుకు ముందు ది అనే పదం ఎందుకు వచ్చిందనే విషయానికి పై వివరణ ఇస్తూ.. తన పేరుకు ముందు ది అనే ట్యాగ్ జోడించడం వల్ల చాలా విపరీతంగా స్పందన వచ్చిందని.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని వల్ల ఏ హీరో కూడా ఎదురుకోలేనని ఎదురు దెబ్బలు తగిలాయని.. యూనివర్సల్ స్టార్, పీపుల్ స్టార్ వరకు ఎన్నో ట్యాగులు ఉన్నాయి.. నాకంటే చిన్నవాళ్లు పెద్దవాళ్లు అన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. నాకంటే ముందు వచ్చిన వారికి కూడా ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. బహుశా ఎలాంటి ట్యాగ్ లైన్ లేకుండా ఉండే హీరో నేనొక్కడినే నేమో అంటూ తెలిపారు. అయితే ఈ ట్యాగ్ తో తనకి పనిలేదు ప్రేక్షకులు తనని తన నటనలతో గుర్తించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. తనని రౌడీ హీరో అని, సదరన్ స్టార్ అనే పేర్లతో పిలిచేవారు. అయితే వాటిని తాను అంగీకరించలేదని.. కానీ లైగర్ సినిమా టీమ్ ది అనే పదాన్ని జోడించిందని అయితే అప్పటివరకు ఈ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో తాను అంగీకరించానని.. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ తర్వాత మళ్లీ తన టీమ్ కి చెప్పి ది అనే పదాన్ని తీసేశానంటు తెలిపారు. చివరికి విజయ్ దేవరకొండ అంటూ పిలిస్తే చాలు అంటు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: