
`మతం ఏదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం` అనే సారాంశంతో శ్యామాలి ఓ సందేశాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమంత పెట్టిన ఫోటోలు ఆమెను బాధించడం వల్లే ఈ విధంగా శ్యామాలి ఇలా పోస్ట్ పెట్టారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
కాగా, సుమంత-రాజ్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నప్పటి నుంచి శ్యామాలి ఇటువంటి పోస్ట్‌లు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం నమ్మకం, కర్మ సిద్ధాంతం అంటూ పెట్టిన పోస్టులు కూడా తెగ వైరల్ అయ్యాయి. 2015లో శ్యామాలి డేను రాజ్ నిమిమోరు వివాహం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా స్క్రిప్ట్ రైటర్‌గా కూడా పని చేసిన అనుభవం శ్యామాలికి ఉంది. రాజ్, శ్యామాలి దంపతులకు ఒక కుమార్తె ఉంది. అయితే ప్రస్తుతం భార్యకు రాజ్ దూరంగా ఉంటున్నాడని.. ఇద్దరూ విడాకులకు కూడా అప్లై చేశారనే బలమైన టాక్ ఉంది. ఈ ప్రచారంపై అటు రాజ్ కానీ, ఇటు శ్యామాలి కానీ ఇంతవరకు డైరెక్ట్ గా స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు