పూరి జగన్నాథ్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.  ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న లెజండరీ పర్సన్. సినిమా పూజా కార్యక్రమాల రోజునే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది..? అన్న విషయాలను క్లియర్ గా చెప్పేసే టాలెంట్ ఉన్న డైరెక్టర్ . అనుకున్న టయానికి సినిమా షూట్ కంప్లీట్ చేసి చెప్పిన టయానికి రిలీజ్ చేసే డైరెక్టర్ . ఇలా పూరి జగన్నాథ్ గురించి అన్ని పాజిటివ్ గానే వినిపించేవి .


కానీ ఇప్పుడు మాత్రం పూరి జగన్నాథ్ రేంజ్ లెవెల్ మొత్తం మారిపోయాయి.  లైగర్ సినిమాతో ఆయనకున్న స్టేటస్ మొత్తం దెబ్బ పడిపోయింది . లైగర్ సినిమా టైంలో పూరి జగన్నాథ్ తీసుకున్న రిస్క్ అదే విధంగా లైగర్ మూవీ ప్లాప్ అవ్వడం పూరి జగన్నాథ్ కి నెగటివ్గా మారిపోయింది . చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ ఓ ప్రాజెక్టు తెరక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక కొత్త సినిమా మొదలైంది. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది.



ఈ ప్రాజెక్టు కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . విజయ్ సేతుపతి లాంటి ఒక నేచురల్ యాక్టర్ తో టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ . కాగా ఈ సినిమాలో  కీలక పాత్ర కోసం టబును తీసుకున్నారు అన్న విషయం అందరికీ తెలుసు . కానీ ఇది ఒక నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ అని తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.  హీరోయిన్గా సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తున్నారట . పూరి జగన్నాథ్ సినిమాలో విలన్ పాత్రలు చాలా స్పెషల్ గా ఉంటాయి .



మరీ ముఖ్యంగా ఆయన రాసుకునే విలన్ క్యారెక్టర్ కి డైలాగ్స్ హైలెట్గా మారుతూ ఉంటాయి. సినిమాలో హీరోకి ఎంత వాల్యూ ఇస్తాడో.. హీరోయిన్ .. విలన్ కి కూడా అంతే వాల్యూ స్టోరీ రాసుకుంటాడు.  పూరి జగన్నాథ్ ఈ సినిమాలో టబు కోసం ఆయన రాసుకున్న నెగిటివ్ పాత్ర సినిమాకి హైలెట్గా మారిపోతుంది అంటున్నారు మేకర్స్.  ఎప్పటినుంచో తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ట్రై చేస్తున్న టబు కి ఇది నిజంగా బిగ్ కం బ్యాక్ అంటున్నారు మేకర్స్.  అంతేకాదు టబు లాంటి హీరోయిన్ తెలుగు తెరపై చూడాలి అంటూ కుర్రాళ్ళు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు . కానీ కుదరలేదు . నెగిటివ్ షేడ్స్ లో బయటపెట్టామనేది బిగ్ రిస్కీ పని.  అలాంటి రిస్కీ పని చేస్తూ ఫుల్ డేర్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్ . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కుర్రాళ్ళు ఎప్పటినుంచో కోరుకుంటున్నా టబుని తెలుగు తెరపై నెగిటివ్ రోల్ లో చూపించడానికి పూరి జగన్నాథ్ తీసుకున్న  నిర్ణయాన్ని అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: