టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్గా పేరు సంపాదించిన కృతి సనన్ ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించి ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తోనే చక్కర్లు కొడుతున్నట్లు కనిపిస్తోంది. తరచూ ఈ మధ్యకాలంలో ఈ రూమర్స్ విషయంలో మరింత వైరల్ గా మారుతోంది. గతంలో హీరో ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా రూమర్స్ వినిపించాయి. అయితే వాటన్నిటికి కూడా చెక్ పెట్టే విధంగా స్వయంగా కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నటుడు కబీర్ బహియాతో లవ్ లో  ఉన్నట్లుగా వినిపించాయి. తరచూ వీరిద్దరూ కలిసి తిరుగుతూ ఉండడంతో ఈరూమర్స్ కి మరింత స్థానం కల్పించింది.



అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి వీరిద్దరూ ఇంగ్లాండుకు వెళ్లి అక్కడ లార్డులో టీమిండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కి సైతం అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు వీడియోలు చూసిన వారందరూ కూడా వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని ఈ ఫోటోలతో వీరి డేటింగ్ కన్ఫర్మ్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బయట తిరుగుతూనే ఉన్నప్పటికీ ఈ రూమర్స్ పైన స్పందించలేదు ఈ జంట.



సాధారణంగా కృతి సనన్ పైన వచ్చే రూమర్స్ ఎప్పటికప్పుడు ఆమె స్పందిస్తూనే ఉంటుంది.కానీ ఇప్పుడు కబీర్ బహీయతో  వస్తున్న రూమర్స్ పైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలా హింట్ ఇచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కృతి సనన్ రెండు చిత్రాలలో బిజీగా ఉన్నది. సినిమా షూటింగ్ సమయం నుంచి కాస్త కాలి సమయం దొరికితే చాలు ఇలా తన బాయ్ ఫ్రెండ్ తో బయట తిరిగేస్తూ ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: