టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన డాన్స్ కొరియోగ్రాఫర్గా , నటుడిగా , దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభుదేవాతో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయ్యిందట. మరి పూరి జగన్నాథ్ , ప్రభుదేవా కాంబోలో మిస్ అయిన సినిమా ఏది ..? ఏ కారణాలతో మిస్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ , రవితేజ హీరోగా త్రిష హీరోయిన్గా ఓ మూవీ చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఒక కథ ను కూడా రెడీ చేసి రవితేజ , త్రిష కు వినిపించారట. వారిద్దరు కూడా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక అంతా ఓకే సినిమా స్టార్ట్ చేద్దాం అనే లోపు రవితేజ "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్" అనే సినిమాను చూశాడట. దానితో ఈ సినిమాను కచ్చితంగా తెలుగులో రీమేక్ చేయాలి అని ఆలోచనకు ఆయన వచ్చాడట. దానితో పూరి జగన్నాథ్ , రవితేజ "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్" మూవీ ని రీమిక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన ఫ్రీ అయ్యే లోపు ఏదైనా ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చాడట. అందులో భాగంగా పూరి జగన్నాథ్ "143" మూవీ కి సంబంధించిన కథను చాలా స్పీడ్ గా పూర్తి చేశాడట. 

ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక అందులో ప్రభుదేవా హీరోగా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనకు వచ్చాడట. అంతలోపే రవితేజ అక్కడికి వచ్చాడట. దానితో రవితేజకు 143 అనే టైటిల్ తో ఓ కథను అనుకున్నాం , ప్రభుదేవాను అందులో హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాట్లు చెప్పాడట. దానితో రవితేజ నీ తమ్ముడు సాయి శంకర్ ఖాళీగానే ఉన్నాడు కదా ... అతనుతో సినిమా తీస్తే బాగుంటుంది కదా అనే సలహా ఇచ్చాడట. దానితో పూరి జగన్నాథ్ "143" మూవీ ని సాయి శంకర్ తో రూపొందించాడట. ఇలా పూరి జగన్నాథ్ , ప్రభుదేవా కాంబోలో సినిమా మిస్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: