
ఈ న్యూస్ తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు - వెంకటేష్ కాంబోలో వచ్చిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " సినిమాలో మొదటగా మహేష్ - చిరంజీవి కోసం రాసిందట . అయితే కొన్ని అనుకోని కారణాల చేత చిరంజీవి దగ్గర నుంచి ఈ సినిమా వెంకటేష్ చేతిలోకి వెళ్ళింది . మహేష్ - చిరు కాంబో అలా మిస్ అయ్యింది. ఒకవేళ వీళ్ళ కాంబో లో సినిమా వచ్చి ఉంటే మాత్రం అనుకున్న దానికన్నా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా ఇంకా హిట్ అయి ఉండేది . ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో మహేష్ బాబు ఒక గెస్ట్ రోల్ లో కనిపించాల్సి ఉండిందట .
కానీ మహేష్ బాబు ఆ రోల్ కి ఇంపార్టెంట్ లేకపోవడంతో క్యాన్సిల్ చేసేసారట . అలా చిన్న క్యారెక్టర్స్ లో నటించను అని చెప్పేసారట . చిరంజీవి సినిమా అయినా సరే తనకి ఇష్టం లేని పాత్ర అస్సలు చేయడు మహేష్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత "ఆచార్య" సినిమాలో కూడా చరణ్ రోల్ కి ముందుగా మహేష్ బాబు ని అనుకున్నారట . మహేష్ బాబు ఈ స్టోరీ విని క్యారెక్టర్ అంత హైలెట్ అయ్యేలా లేదు అంటూ రిజెక్ట్ చేసారట . అంతేకాదు అంతకు ముందు "వాల్తేరు వీరయ్య" సినిమాలో రవితేజ చేసిన పాత్రను మహేష్ చేయాల్సింది . కానీ మహేష్ ఈ పాత్ర రిజెక్ట్ చేసారట . నాకు ఆ బాడీ లాంగ్వేజ్ సూట్ కాదు అంటూ ఓపెన్ గానే చెప్పారట. ఇలా వరుసగా మహేష్ - చిరంజీవి సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే చాలామంది చిరంజీవి అంటే కోపమని ..కావాలని మహేష్ బాబు హెడ్ వెయిట్ చూపిస్తున్నాడు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అదంతా ఏం లేదు . క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే మహేష్ ఏ సినిమాలోనైన నటిస్తాడు అని ఫ్యాన్స్ కూడా క్లారిటీ ఇచ్చారు..!!