
ఈమె తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి గుర్తింపు అందుకుంది. కెరియర్ ప్రారంభంలో తెలుగులో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన నర్సింహుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మడు బాగానే క్రేజ్ సంపాదించింది. అంతే కాకుండా రానా నటించిన ఒక చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్లో కనిపించింది. ఆ తర్వాత హిందీ చిత్రాల వైపు అడుగులు వేసింది. 2013 నుంచి సమీరా రెడ్డి పెద్దగా సినిమాలలో కనిపించలేదు వివాహం చేసుకొని మరి సెటిల్ అయ్యింది. చివరిగా 2024లో నమ్ అనే చిత్రంలో నటించింది.
సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన శరీరంలో కొన్ని మార్పులు క్రమక్రమంగా వచ్చాయని.. దాంతో తనని చాలామంది సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని తెలిపింది.. ఆ సమయంలో కొంతమంది తనని బ్రెస్ట్ ఇంప్లిమెంటేషన్ సర్జరీ చేయించుకోమని చాలా ఒత్తిడి చేశారని దీంతో తనకి ఇష్టం లేక ఎన్నో చిత్రాలను కూడా రిజెక్ట్ చేశానని తెలిపింది. ఎంత చెప్పినా కూడా ఆ సమయంలో వినేవారు కాదని చాలా ఎమోషనల్ గా మాట్లాడింది సమీరా రెడ్డి. సర్జరీ చేయించుకునే వారిని తాను తప్పు పట్టను.. ఎవరికి ఇష్టం లేకుండా ఒత్తిడి చేయకూడదు కదా అంటూ తెలిపింది..