
ఇలాంటి లెజెండరీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతుండటం శ్రోతలను షాక్‌లో పడేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘మైనే ప్యార్ కియా ఫిర్ సే’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచించబడ్డాయి. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ను తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి ఇది పెద్ద షాక్‌గానే ఉంటుంది. ఎందుకంటే అర్బాజ్ వయసు ఇప్పటికే 57 సంవత్సరాలు. ఇప్పటి కాలంలో రొమాంటిక్ పాత్రలకి ఎంతవరకు సరిపోతారనేది పెద్ద ప్రశ్నే. పైగా, మైనే ప్యార్ కియాకి ఉన్న ప్రత్యేకత, వింటేజ్ ఫీల్‌ను బలహీన పరచే అవకాశం ఉన్నందున ఈ సీక్వెల్‌పై నెటిజన్లు కొంత అసంతృప్తిగా ఉన్నారు.
అర్బాజ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన "జై చిరంజీవా" సినిమాలో విలన్‌గా కనిపించారు. కానీ అప్పట్లో కూడా ఆయన నటన కన్నా స్టార్ కాంతి ఎక్కువగానే మాట్లాడబడ్డది. ఇప్పుడీ వయసులో ప్రేమ కథలపై ప్రయోగాలు చేయడమంటేనే ప్రేక్షకులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పటి వరకూ రాజశ్రీ పతాకం లేదా సూరజ్ బరజాత్య నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ అంతర్గత సమాచారం ప్రకారం అర్బాజ్ నిజంగా ఈ సీక్వెల్‌పై ఆసక్తిగా ఉన్నట్టు, ముందడుగు వేస్తున్నట్టు టాక్. అయితే ‘మైనే ప్యార్ క్యూ కియా’ (2005) అనే సినిమా సల్మాన్ గతంలో చేసినా, అది ఈ సీక్వెల్‌కు సంబంధం లేనిదే. కేవలం టైటిల్‌తో ఆట ఆడారు. ఇప్పుడు మాత్రం ‘ఫిర్ సే’ అనే పదంతో మళ్లీ ఎమోషనల్ కనెక్ట్‌ని ట్రై చేయాలనుకుంటున్నారా అన్నదానిపై పెద్ద చర్చే నడుస్తోంది.
ఇది గాసిప్‌గానే మిగిలిపోతే బెటర్ అని భావించే వారు ఎక్కువ. ఎందుకంటే ఒక అపురూప ప్రేమ కథను, మళ్లీ తక్కువ క్రేజ్‌తో డైల్యూట్ చేయడం అభిమానులకు నచ్చకపోవచ్చు. ఇక సల్మాన్ ఖాన్ దీనిపై ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం. ఆ చిత్రం వలన ఆయనకు వచ్చిన గుర్తింపు, ఈ సీక్వెల్ ఎలా ప్రభావితం చేస్తుందనేది చూడాలి. దీనికి రాజశ్రీ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేక ఇది కేవలం బజ్‌గానే మిగిలిపోతుందా ? అన్నది తేలాల్సి ఉంది. ఒకటే ఖాయం – "మైనే ప్యార్ కియా" పేరు ఎక్కడ వినిపించినా ఇప్పటికీ హృదయాలు కొట్టుకుంటాయి. అందుకే సీక్వెల్ అనగానే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు.