
ఈ సినిమాలో చిరంజీవికి నాలుగేళ్ల కొడుకు ఉంటాడని, అతని చుట్టూ కథలో గాఢమైన ఎమోషనల్ ట్రాక్ నడుస్తుందని వశిష్ట చెప్పుకొచ్చారు. రెక్కల గుర్రం, ఉడుత వంటి ఫాంటసీ పాత్రలు కూడ ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇది చిరంజీవి కెరీర్‌లోనే విజువల్స్ పరంగా హయ్యెస్ట్ వీఎఫ్‌ఎక్స్ ప్రాజెక్ట్ అని టీమ్ గర్వంగా ప్రకటించింది. ఇంకా హీరోయిన్ త్రిష పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉండనుంది. త్రిష చుట్టూ కథ తిరుగుతుంది అని దర్శకుడు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అయితే, ‘‘హీరో హీరోయన్ కోసం విశ్వంభర అనే లోకానికి వెళ్లాడు’’ అనే లైన్ ఊహించేస్తున్నారు. ఇది నిజమో కాదో మాత్రం ప్రేక్షకులకు తేలాల్సిన విషయం.
ఇదిలా ఉంటే, సినిమాలో ఉన్న అన్ని సీన్లు పూర్తవగా, ఒక్క పాట, రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. మరికోన్నిరోజుల్లో మరో టీజర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది. అలాగే "విశ్వంభర ఎప్పుడు వస్తుందా?" అని రోజూ గడియారాన్ని చూస్తూ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. అయితే ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నటు తెలుస్తుంది .. ఈ సినిమాలో సాంగ్స్, విజువల్స్, ఎమోషన్ అన్నీ టాప్ లెవెల్‌లో ఉండబోతున్నాయట. మొత్తానికి... బింబిసార తరువాత వశిష్ట మరో సెన్సేషనల్ ఫాంటసీ రైడ్‌కు సిద్ధమవుతున్నాడు. విశ్వంభర విడుదల వరకు మాత్రం మెగా ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే!