
ఆ హీరోయిన్ ఎవరో కాదు మల్లికా షెరావత్. ఒకప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతోనే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్స్ కోసం చాలా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. హాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన మల్లికా షెరావత్ తన వ్యక్తిగత విషయాలలో కూడా నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉండేది.
చాలామంది హీరోలతో ఈమె డేటింగ్ చేసిందనే వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. సినిమాలకు దూరంగా ఉండి సోషల్ మీడియాలోనే ఎక్కువగా తన సమయాన్ని ఇప్పుడు గడిపేస్తోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది హీరోలు తనని రాత్రి సమయాలలో కలవాలని ఫోన్లు చేసి తెగ ఇబ్బంది పెట్టే వారిని.. అయినా తాను ఎందుకు రాత్రి సమయాలలో వెళ్లాలని అడిగేదాన్ని అంటూ తెలిపింది.. బోల్డ్ సినిమాలో నటించిన మాత్రాన హీరోలు చెప్పినట్టుగా వినాలా..? పెద్ద హీరోలతో ఒప్పుకోకపోవడంతో తన చేతిలో సినిమాల లేకుండా చేశారని.. తాను ఆ టైపు కాదు తాను తెర మీద మాత్రమే బోల్డ్ నటించాను.. హీరోల ఆలోచనలను తాను ఎప్పుడు కూడా అంగీకరించలేదంటూ తెలియజేసింది. అయితే హీరోల పేర్లు మాత్రం తెలపలేదు ఈ ముద్దుగుమ్మ.