టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అనసూయ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే అనసూయ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువమంది అభిమానులకు మాత్రమే తెలుసు. తన వ్యక్తిగత జీవితం గురించి అనసూయ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయని ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణమని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నేను కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నానని  ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలుగుతున్నానని ఆమె అన్నారు.  టీమ్ వర్క్ తోనే ఇవి దక్కాయని ఆమె పేర్కొన్నారు.  నాన్న హైదరాబాద్  లోని  రేస్ క్లబ్ లో  ట్రైనర్ గా పని చేసేవారని  రేస్ వల్ల   ఆర్థికంగా ఏ రోజు ఎలా ఉండేదో  తెలియని పరిస్థితి అని అనసూయ చెప్పుకొచ్చారు. లైఫ్ లో స్థిరత్వం అనేది చాలా ముఖ్యమని నాన్న అది అర్థం చేసుకోలేకపోయారని ఆమె తెలిపారు.

నాన్నకు అబ్బాయి పుట్టలేదన్న బాధ ఉండేదని  నాన్న అందమే నాకు వచ్చిందని అనుకుంటున్నానని  అనసూయా పేర్కొన్నారు.  పెళ్లి నా లైఫ్ లో  టర్నింగ్ పాయింట్ అని  నేను బీహార్ వ్యక్తిని ప్రేమించి  మరీ పెళ్లి చేసుకున్నామని  వెల్లడించారు.  ప్రతి విషయంలో నాకు భర్త సపోర్ట్ ఉంటుందని  పెళ్ళై అమ్మానాన్నలకు దూరమైనా తర్వాత  వాళ్ళ విలువ తెలిసిందని  అనసూయ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

ఎంబీఏ  చదువుతున్న సమయంలో  విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్  గా  ఇంటర్న్షిప్  చేశానని  సుకుమార్, త్రివిక్రమ్ మెహర్ రమేష్ లాంటి వాళ్ళు  అక్కడే పరిచయం అయ్యారని  ఆమె అన్నారు.  సినిమా రంగంపై అప్పుడున్న సందేహాల వల్ల అప్పుడు నటించడానికి  అంగీకరించలేదని  అనసూయ వెల్లడించారు.  సినిమాల్లోకి రాకముందు ఒక ఛానల్ లో  పని చేశానని  జబర్దస్త్ కు ముందు  మరికొన్ని షోస్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్య2 సినిమాలో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: