టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సినిమా ఏదైనా ఉందంటే అది విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై మొదటి నుంచే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం జరిగిన పోటీ... దానిలో నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న డీల్ మొత్తం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. ఎందుకంటే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రూ. 50 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం వస్తోంది! గతంలో ‘జెర్సీ’, మ‌ళ్ళీరావా, వంటి చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు, త్రివిక్రమ్ శిష్యుడు నాగ వంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.


విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సూరి అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. టీజర్, పాటలతో ఇప్పటికే కింగ్‌డమ్‌ యువతను ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్, క్లాస్ – మాస్ బలాన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే థియేటర్‌లోకి అడుగు పెట్టకముందే, ఈ మూవీ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించింది. విజయ్ దేవరకొండ ఇమేజ్, మ్యూజిక్‌పై ఉన్న హైప్, గౌతమ్ నేరేషన్‌పై నమ్మకం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే… ఓటీటీ సంస్థలు ఈ సినిమా కోసం పోటీ పడడం సహజమే. ఈ పోటీలో చివరికి నెట్‌ఫ్లిక్స్ ముందు వరుసలో నిలిచి, అటు తెలుగు – హిందీ – ఇతర భాషల డిజిటల్ హక్కులను దక్కించుకుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 50 కోట్లు అన్న వార్తతో, ఈ సినిమా విడుదలకు ముందు ఒక పెద్ద కమర్షియల్ విజయాన్ని అందుకున్నట్లే అయింది.


సాధారణంగా ఓటీటీ రైట్స్‌కి ఈ స్థాయి విలువ రావడం అంటే ఆ సినిమా పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదనే విషయాన్ని చూస్తే, బజ్ ఎలా పెరిగిందో అర్థమవుతుంది. ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, కింగ్‌డమ్ తొలి వీకెండ్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించనుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ రైట్స్ వివరాలు బయటకు రావడంతో, సినిమా పై ఉన్న క్యూరియాసిటీ మరింత పెరిగింది. జులై 31న థియేటర్లలో విజయ్ దేవరకొండ మరోసారి మాస్ మెజిక్కు రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: