సూపర్ స్టార్ మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ పై ఖర్చు 1000 కోట్లు దాటిపోతుంది అని అంటున్నారు. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏసినిమా పై పెట్టని భారీ బడ్జెట్ ఈమూవీ పై పెడుతూ ఉండటంతో ఈసినిమాకు సంబంధించిన వార్తలు నేషనల్ మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాయి.


రాజమౌళి ఏఫంక్షన్ కు వచ్చినా అక్కడకు వచ్చిన ప్రేక్షకులు జక్కన్నను మహేష్ సినిమా గురించి అప్ డేట్స్ ఇమ్మని అడిగినప్పటికీ ఆప్రశ్నకు స్పందించకుండా జక్కన్న తన చిరునవ్వు సమాధానంగా ఇస్తూ చాల తెలివిగా తప్పించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక సంచలన విషయం ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు బయటకు లీక్ అయింది. ఈమూవీని హాలీవుడ్ మూవీగా మార్కెట్ చేయడానికి తెలుగుతో పాటు డైరెక్ట్ ఇంగ్షీషు వెర్షన్ గా విడుదల చెయ్యాలని రాజమౌళి ఆలోచిస్తున్న నేపధ్యంలో కొన్ని ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లతో జక్కన్న ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు టాక్.


ఇలా రాజమౌళి వ్యవహరించడం వెనుక మాష్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. జక్కన్న తాను తీసిన సినిమాను ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది అన్నమాటలు వినిపిస్తున్నాయి. లేదంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి మరన్ని ఆస్కార్ అవార్డులు వచ్చి ఉండేవని రాజమౌళి వ్యక్తిగత అభిప్రాయం అని అంటారు.


దీనితో  రాజమౌళి తన ఎస్ఎస్ఎంబి మూవీని ఒక హాలీవుడ్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని భారీ స్థాయిలో తీయగలిగితే తన మూవీకి ఆస్కార్ అవార్డుల రేస్ లలో పురస్కారాలతో పాటు తన మూవీ డైరెక్ట్ ఇంగ్లీష్ మూవీ అర్హత సాదిస్తుందని జక్కన్న ఎత్తుగడ అని అంటున్నారు. అయితే ఈమూవీ ఇంగ్షీషు వెర్షన్ కూడా స్ట్రెయిట్ గా షూట్ చేయాల్సి వస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈవిషయాల మీద రాజమౌళి తన ఆలోచనలు తన సన్నిహితులతో పంచుకుంటున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: