ఎప్పుడెప్పుడా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూసిన "హరిహర వీరమల్లు" సినిమా  మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నటించిన రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తన కెరీయర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న "హరిహర వీరమల్లు" సినిమా మరి కొద్ది రోజుల్లోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . జూలై 24వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది .

సాధారణంగా యుఎస్ మార్కెట్లో మనకంటే ముందుగా ఒకరోజు ప్రీమియర్స్ పడతాయి.  అయితే "హరిహర వీరమల్లు" సినిమా విషయంలో మాత్రం ట్రెండ్ సెట్ చేస్తున్నారు మేకర్స్ . రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎర్లీ షోస్ ఉంటాయి అంటూ నిర్మాత నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది . లేటెస్ట్ గా  నిర్మాత ఏ ఏం రత్నం సాలిడ్ అప్డేట్ ని అభినందనలు అందించి గుడ్ న్యూస్ వినిపించారు . దీనితో అమెరికాలో ఎప్పుడైతే ప్రీమియర్స్ పడతాయో సేమ్ అదే టైంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ "హరిహర వీరమల్లు" సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు .

సినిమా జూలై 24వ తేదీ గురువారం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది . అయితే ముందుగానే ప్రీమియర్స్ పడతాయి అంటే జూలై 23 రాత్రి 9:30 నిమిషాల నుండి హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తెలుగు రాష్ట్రాలలో పడతాయి .. అంటే అప్పటినుంచి జాతర మొదలైపోయింది అనమాట . హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . 14 రోజులపాటు టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ నిర్మాత ఏం రత్నం నుంచి విజ్ఞప్తి అందుకోగా.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

14 రోజుల పెంపును తిరస్కరించి ఏపీ సర్కార్ 10 రోజులకు మాత్రమే టికెట్ ధరను పెంచుకునేలా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది . తద్వారా అన్ని సినిమాలను సమానంగానే చూస్తామంటూ సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టిక్కెట్ రేటు రు. 600..లోయ‌ర్ క్లాస్ రు. 100, అప్ప‌ర్ క్లాస్‌కు రు. 150 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో రు. 200 వ‌ర‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప‌ది రోజుల పాటు రేట్లు అలానే కొనసాగుతాయి. దీంతో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రివ్యూలు వస్తే కలెక్షన్స్ పరంగా కూడా మంచి లాభాలు అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ చిత్రాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏ ఏం రత్నం సమర్పణలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 28 రిలీజ్ చేయాలి అనుకున్నారు మూవీ మేకర్స్ . కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాను జూలై 24న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు . అనుకున్న టయానికి రిలీజ్ చేస్తున్నారు . మరి సినిమా ఎలా ఉంటుంది ..? సినిమాలోని ప్లస్ లు..? మైనస్ లు ఏంటి..? అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: