హీరోయిన్ గా చేసిన తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది కృతి శెట్టి. 2019లో బాలీవుడ్ మూవీ `సూపర్ 30` అనే చిత్రంలో స్టూడెంట్ గా ఒక చిన్న క్యారెక్టర్ ను పోషించి వెండితెరపై అడుగుపెట్టిన కృతి శెట్టి.. 2021లో తెలుగు బ్లాక్ బస్టర్ `ఉప్పెన`తో హీరోయిన్‌గా మారింది. ఇందులో బేబమ్మగా అందరి హృదయాలు దోచుకుంది.
ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. కానీ తెలుగులో కృతి శెట్టికి హిట్స్ కన్నా ఫ్లాపులే ఎక్కువగా పడ్డాయి. దాంతో అమ్మడి కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. చివరిగా కృతి శెట్టి `మనమే` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ దెబ్బ‌తో కృతి శెట్టికి తెలుగులో మరో అవకాశం రాలేదు.
ఆమె కన్నా తర్వాత వచ్చిన శ్రీలీల టాప్ హీరోలతో జోడి క‌డుతూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. కానీ కృతి శెట్టి మాత్రం ఆ జోరు చూపించలేకపోతోంది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది. బ‌ట్ నో యూజ్‌. ఒక్క టాలీవుడ్ హీరో కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు.
తాజాగా రెడ్ కలర్ డీప్ లో-నెక్ టాప్ మరియు జీన్స్ లో అందాలు ఆరబోసింది. ఉప్పొంగే ఎద అందాల‌కు తోడు త‌న కిల్లింగ్ లుక్స్ తో కృతి కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.
కాగా, ప్ర‌స్తుతం కృతి శెట్టికి తెలుగులో సినిమాల్లేవు. అయితే త‌మిళంలో మాత్రం కార్తికి జోడిగా `వా వాతియార్` చిత్రంలో యాక్ట్ చేస్తోంది. అలాగే `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ`, `జెనీ` అనే సినిమాల్లోనూ భాగ‌మైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: