ఒకసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిన హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు మాత్రం కెరీర్ పరంగా చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులను తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో, గ్లామర్‌తో అలరిస్తూ స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. వరుస ఫ్లాపులతో ఇప్పుడు సీరియస్‌గా తన కెరీర్ గురించి ఆలోచించాల్సిన దశకు వచ్చింది. సక్సెస్ నుండి సెట్బ్యాక్ దాకా… “పెల్లి సందD” సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. కానీ గ్లామర్, గ్రేస్ ఉన్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ముఖ్యంగా “గుంటూరు కారం” సినిమాతో వచ్చిన అపజయం తర్వాత ఆమె హవా తగ్గినట్టే అయింది. ఆ సినిమా ఆమెకు పెద్దగా ఏ మైలేజ్ ఇవ్వలేదు. తాజాగా జూనియర్ మూవీతో  ఆ సినిమాలో కిరీటికి జతగా నటించింది శ్రీలీల. వైరల్ వయ్యారి సాంగ్ తో జూనియర్ సినిమా చూసేందుకు బజ్ తెచ్చినా కూడా సినిమా మాత్రం మొదటి షో నుంచే రొటీన్ సినిమా అనే టాక్ తెచ్చుకుంది.  


శ్రీలీల ఉన్న సినిమాల్లో పాటలు సూపర్ హిట్ కావడం రెగ్యులర్‌గా జరుగుతుంటే, కథలో ఆమె పాత్ర మాత్రం పూర్తిగా అణగదొక్కబడుతుంది. దీంతో ఆమెపై ప్రేక్షకుల్లో నిరుత్సాహం పెరుగుతోంది. ఫ్లాపుల వరుస.. ఆఫర్ల తగ్గుదల... గుంటూరు కారం తర్వాత శ్రీలీలకు పెద్దగా క్రేజీ ఆఫర్లు రాకపోవడమే కాదు, ప్రస్తుతం ఆమె సినిమాలు కూడా గట్టి హిట్ కొట్టడం లేదు. ఈ పరిస్థితిలో “కథ”కు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం డ్యాన్స్, గ్లామర్‌లోనే పెట్టుబడి పెడుతూ ఉండటం ఆమె కెరీర్‌కు మైనస్ అవుతోంది. సినిమా ఇంతగా నడవకపోతే హీరోయిన్‌కు క్రేజ్ మిగలదు – ఇదే అందరికీ తెలిసిన నిజం. టర్నింగ్ పాయింట్ అవుతాయా.. రవితేజ, పవన్ సినిమాలు? ఇప్పటివరకు వచ్చిన సెట్బ్యాక్స్ అన్నీ తట్టుకుని మళ్లీ గాడిలో పడాలంటే శ్రీలీలకు ఇప్పుడు ఒకే ఒక్క మార్గం – సాలిడ్ హిట్. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజ్ రవితేజతో చేస్తున్న “మాస్ జాతర” సినిమా, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమ‌లపై ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది.


హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న పవన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు బలం ఉంటే, మళ్లీ ఆమె మార్కెట్ దూసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే రవితేజ సినిమా మాస్ కంటెంట్‌తో ఉంటుందనే వార్తల నేపథ్యంలో, అది కూడా ఆమెకు ఓ బ్రేక్ ఇస్తుందన్న ఆశలు ఉన్నాయి. శ్రీలీల టాలెంట్‌కి సందేహం లేదు. కానీ కథల‌ ఎంపిక  విషయంలో తొందరపడితే, ఎంత టాలెంట్ ఉన్నా నిలబడడం కష్టం. డ్యాన్స్ మాత్రమే కాదు, ఎమోషన్స్ ఉన్న పాత్రలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు హిట్ అయితే… మళ్లీ శ్రీలీల తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశముంది. లేదంటే మాత్రం ఆమె కెరీర్ వంకర మలుపులోనుండి బయట పడటం కష్టమే!

మరింత సమాచారం తెలుసుకోండి: