
చరణ్ ట్రాన్స్‌ఫార్మేషన్: నెవ్వర్ బిఫోర్ లుక్ ... చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ బ్లాక్ అండ్ వైట్ వర్కౌట్ ఫోటోపై అభిమానులు పడి చచిపోతున్పరు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, కండలు తిరిగిన శరీరంతో ఏకంగా ‘విలన్ లెవెల్’ లుక్‌లో కనిపిస్తున్న చరణ్... ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగా కష్టపడుతున్నారో ఈ పిక్ స్పష్టంగా చెబుతోంది. "Changeover started for #PEDDI" అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ ఫోటోపై ఫ్యాన్స్ ఊహలకి అవధులు లేవు. “ఇది బాడీ కాదు బాసు, బాక్సాఫీస్ దూకుడు!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి టాప్ యాక్టర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజువల్‌గా, కంటెంట్ పరంగా ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. ఈ భారీ సినిమాను 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాస్ + క్లాస్ + యాక్షన్ మిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానులకు ఓ మేగా ట్రీట్ లానే మారనుంది.