
ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న రోషన్.. మళ్ళీ 2021లో `పెళ్లి సందడి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. కానీ రోషన్ మాత్రం సరైన జోరు చూపించలేకపోతున్నాడు. ఇప్పటికే హైట్, లుక్, పర్సనాలిటీ పరంగా రోషన్ మంచి మార్కులు వేయించుకున్నాడు, నటన పరంగానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది.
అయినా కూడా రోషన్ కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. పెళ్లి సందడి తర్వాత అతని నుంచి మరొక సినిమా రాలేదు. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. కొడుకు విషయంలో శ్రీకాంత్ చాలా కేర్ తీసుకుంటున్నారట. స్క్రిప్ట్ కంప్లీట్ గా నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. లేదంటే నిర్మొహమాటంగా నో అని చెప్పేస్తున్నారట. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంలో రోషన్‌కు సంబంధించి శ్రీకాంత్ 50 స్క్రిప్ట్ లు రిజెక్ట్ చేశాడని ప్రచారం జరుగుతుంది. దీంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకోవడంలో తప్పులేదు.. కానీ తనయుడు విషయంలో శ్రీకాంత్ మరి ఇంత సెలెక్టివ్ గా ఉండడం కరెక్ట్ కాదని, దానివల్ల అతని ప్రైమ్ టైం వేస్ట్ అయిపోతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సినిమా సినిమాకు మూడు నాలుగేళ్లు గ్యాప్ అంటే కెరీర్ డేంజర్ జోన్‌లో పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. కాగా, రోషన్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి `వృషభ` కాగా.. మరొకటి `ఛాంపియన్`. మరి ఈ సినిమాలైనా రోషన్ కెరీర్‌కు ఊపు తీసుకొస్తాయేమో చూడాలి.