
అయితే వీరమల్లులా వార్2 సినిమాకు నైజాంలో టికెట్ రేట్లు పెంచుతారా అనే ప్రశ్నకు ప్రస్తుతం అయితే కాదని వినిపిస్తోంది. వీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి టికెట్ రేట్ల పెంపు దిశగా అడుగులు పడ్డాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులతో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ కోరితే మాత్రం టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు రావడం కష్టమేం కాదు.
వార్2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. 3, 4 నెలల పాటు చర్చలు జరిగాయని చివరకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశానని నాగవంశీ తెలిపారు. వార్2 సినిమాను నార్త్ సినిమా అనుకోవద్దని ఆయన వెల్లడించారు. హృతిక్, తారక్ కాంబో సాంగ్ తాను కూడా విన్నానని ఆ సాంగ్ అదిరిపోయిందని నాగవంశీ కామెంట్లు చేయడం గమనార్హం.
నిర్మాత నాగవంశీ వెల్లడించిన విషయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. వార్2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళలాడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.