తెలుగులో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో నిత్యా మీనన్ ఒకరు. ఈమె నాని హీరోగా రూపొందిన అలా మొదలైంది అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో నిత్యా మీనన్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తక్కువ కాలం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంది.

ఈమె తెలుగులో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సార్ మేడమ్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఈ నెల 25 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ బ్యూటీ ఓ  ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె పెళ్లి గురించి అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నిత్యా మీనన్ పెళ్లి గురించి మాట్లాడుతూ ... మీకు ఒక వేళ పెళ్లి జరిగితే అది ఎంతో మంచి విషయమే. అదే పెళ్లి జరగకపోయినా అది మంచి విషయమే. ఇతరుల లైఫ్ తో పోల్చుకున్నప్పుడే మీరు బాధపడడం మొదలవుతుంది అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. ఇలా పెళ్లి గురించి నిత్య మీనన్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సార్ మేడమ్ సినిమాలో విజయ్ సేతుపతి హీరో గా నటించాడు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: