పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్ల దగ్గర ఏ స్థాయిలో సందడి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన సినిమా విడుదల అవుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సందడి వాతావరణాన్ని ఆయన అభిమానులు నెలకొల్పుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ రేపు అనగా జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాను భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఎన్ని థియేటర్లలో విడుదల కానుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

సినిమా నైజాం ఏరియాలో 380 నుండి 400 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఈ సినిమా 850 నుండి 900 థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. దానితో దాదాపుగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1300 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని దాదాపు 800 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఈ మూవీ 750 వరకు థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 2850 థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ మూవీ భారీ ఎత్తున థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి గనుక హిట్ టాక్ వస్తే ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: