
సినిమాపై తొలి స్పందన చూస్తే, అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ నటన, ఎమ్ఎం కీరవాణి సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పవన్ లుక్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోందని అంటున్నారు. అయితే... అదే సమయంలో మిశ్రమ స్పందన కూడా కనిపిస్తోంది. కొన్ని రివ్యూలు ప్రకారం, ఫస్ట్ హాఫ్ ఇంటెన్స్‌గా ఉండగా, సెకండ్ హాఫ్ గందరగోళంగా, స్టొరీ ఫ్లో వీక్‌గా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చిన టర్న్ మాత్రం "సెకండ్ పార్ట్"పై హైప్ క్రియేట్ చేసింది. వీఎఫ్ఎక్స్ విషయానికి వస్తే, ప్రేక్షకుల అభిప్రాయం మిడ్ రేంజ్‌లో ఉంది. మరింత ఫినిషింగ్ ఉండి ఉంటే విజువల్‌గా మరింత క్రేజ్ వచ్చేదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ డిజాస్టర్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడానికి యత్నిస్తుండగా, పవన్ అభిమానులు మాత్రం కౌంటర్ ఇస్తూ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి, మొదటి రోజు కలెక్షన్ల పరంగా వీరమల్లు తన మార్కు చూపించగలిగినట్టు స్పష్టమవుతోంది.
ఇక సినిమాతో పాటు పవన్ రాజకీయ వర్గంలోనూ వార్తల్లో నిలిచారు. సినిమా రిలీజ్ అయిన రోజే అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ పరిణామం ఆయన బాధ్యతాపూరిత వైఖరిని నిరూపించింది. సినిమా ప్రమోషన్ లేదా సెలబ్రేషన్స్ కోసం సమయం కేటాయించకుండా, ప్రభుత్వ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమశిక్షణ చూసి అనేకమంది నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఆయన్ను అభినందిస్తున్నారు. ఇంతకీ ‘హరిహర వీరమల్లు’ హిట్టా? ఫ్లాపా? అనే తేలికపాటి చర్చతో కాకుండా, ఈ సినిమా లాంగ్‌రన్‌లో ఎంత వసూలు చేస్తుంది? సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? అనే ఆసక్తికర అంశాలపై చర్చ మొదలైంది. అయితే పవన్ అభిమానులకు మాత్రం ఇది ఫెస్టివల్ మూవీనే. రెండో పార్ట్‌పై ఇప్పటినుంచే హైప్ పెరగడం చూస్తే, ఈ ఫ్రాంచైజ్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు.