
ఇటీవలే మళ్లీ రీ యంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రం అయినా సత్య సినిమాలో కూడా నటించిన ఇవేవీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇండియన్ 2 సినిమాలో కూడా నటించింది. దీంతో కాజల్ అగర్వాల్ కు అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరనే విషయంపై గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన కామెంట్స్ ని అభిమానులు వైరల్ గా చేస్తున్నారు.
కాజల్ కు ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరని అడగగా వెంటనే ఎన్టీఆర్ అని చెప్పింది. వీరిద్దరూ కలిసి బృందావన, బాద్ షా చిత్రాలలో కలిసినటించారు. అలాగే ఎన్టీఆర్ కోసమే జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అనే సాంగ్ లో కనిపించింది కాజల్ అగర్వాల్. ఇక తమిళంలో హీరో విజయ్ దళపతి అంటే చాలా ఇష్టమని తెలిపింది.. ఇటీవలే కన్నప్ప చిత్రంలో కూడా ఒక పాత్రలో కనిపించింది అలాగే బాలీవుడ్ లో రామాయణ చిత్రంలో మండోదరి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.