మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆశక్తి ఉంది. రాజమౌళి ఎక్కడ కనిపించినా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇమ్మని అభిమానులు మీడియా వర్గాలు అనేకసార్లు అడుగుతున్నారు. ఈప్రశ్నకు జక్కన్న పెదవుల పై చిరునవ్వు కనిపిస్తోంది కానీ అతడి నోటివెంట ఒక్క సమాధానం కూడ రావడంలేదు.


మూవీ షూటింగ్ ప్రారంభం అయి కొన్ని నెలలు అయినప్పటికీ ఒక చిన్న వర్కింగ్ స్టీల్ కూడ లీక్ అవ్వకుండా రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఆగష్టు నెలలో రాబోతున్న మహేష్ పూతహయినారోజునాడు ఉండవచ్చని అభిమానుల అంచనా.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న   పృథ్విరాజ్ సుకుమారన్ ఒక లీక్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏసీనిమాలోను కనిపించని డిఫరెంట్ లొకేషన్స్ ఈమూవీలో ఉంటాయని అంచనాలు పెంచుతున్నాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పృథ్విరాజ్ ఈ లీక్ ఇచ్చాడు.  ఆగష్టులో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసంఈ మూవీ యూనిట్ ఆఫ్రికా అడుగుల బాట పడుతుందని వార్తలు వస్తున్నాయి.




జంతువులు అడవుల బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఈ షూటింగ్ లోచిత్రీకరిస్తారని తెలుస్తోంది. 2027 మార్చిలో వచ్చే ‘ఉగాది’ పండుగరోజున ఈమూవీ విడుదల అయ్యే విధంగా ప్లాన్ చెస్తున్నారని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి ఫోటో లీక్ కాకుండా రాజమౌళి రహస్యం పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న ఆలోచనలు షూటింగ్ షెడ్యూల్ లు తరుచు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయినా ఆశ్చర్యం ఉండదు. అప్పటివరకు మహేష్ అభిమానులు వేచి చూడటం తప్ప మరొక మార్గం రాజమౌళి ఆలోచనలలో లేదు అన్నది వాస్తవం..      


మరింత సమాచారం తెలుసుకోండి: