
2009లో బాలీవుడ్ మూవీ `లక్`తో శృతి హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు లుక్స్ పరంగా శృతి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తన రూపాన్ని మార్చుకుంది. 2011లో `అనగనగా ఓ ధీరుడు` మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ వెంటనే `ఓ మై ఫ్రెండ్`లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న నిరాశే ఎదరైంది. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపులు పడడంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
అయితే ఈ ముద్రను `గబ్బర్ సింగ్` మూవీతో ఆమె చేరిపేసుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజా ఇంటర్వ్యూలో ఐరన్ లెగ్ విమర్శలపై శృతి ఘాటుగా స్పందించింది. `గబ్బర్ సింగ్ కన్నా ముందు తెలుగులో నేను చేసిన రెండు సినిమాలు సరైన ఆదరణ సొంతం చేసుకోలేదు. దాంతో నాకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఇచ్చారు. తెలుగులో నా మొదటి రెండు సినిమాలు ఒకే హీరోతో చేశాను. కానీ నన్ను మాత్రమే ఐరన్ లెగ్ అన్నారు. ఏ ఆ హీరో కాదా? ఒక సినిమాలో హీరోయిన్ మాత్రమే కాదు హీరో కూడా ఉంటారు. హిట్ కొడితే హీరోకి క్రెడిట్ ఇస్తారు. అదే ఫ్లాప్ అయిందంటే హీరోయిన్ వల్ల అంటారు.` అంటూ శృతి హాసన్ అసహనం వ్యక్తం చేసింది.
నావి ఐరన్ లెగ్స్ కాదు గోల్డెన్ లెగ్స్ కాదు.. నా కాళ్లను నాకు వదిలేయమని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో `త్రీ` మూవీ ఫ్లాప్ అవడం పట్ల శృతిహాసన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో కష్టపడి త్రీ సినిమాలో యాక్ట్ చేశానని.. అది హిట్టు కానందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నానని శృతి పేర్కొంది. ఇప్పుడు కనుక త్రీ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.