టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో మొట్ట మొద టి సారి వార్ 2 అని హిందీ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటించాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలు ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది. మరి ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో ఎన్ని వ్యూస్ , ఎన్ని లైక్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 22.34 మిలియన్ వ్యూస్ , 203 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి 24 గంటల్లో మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో గా ఎవరు కనిపించబోతున్నారు ..? విలన్ గా ఎవరు కనిపించబోతున్నారు ..? అనే దానిపై జనాల్లో పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక ఈ మూవీ లో తారక్ హీరోగా కనిపించబోతున్నట్లు , హృతిక్ రోషన్ నెగటివ్ షెడ్స్ పాత్రలో కనిపించబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. మరి ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: