
నాని నటించిన సరిపోద శనివారం సినిమాతో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలోకి కమ్ బ్యాక్ అందుకుంది ప్రియాంక. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కవిన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇవి తప్ప మరేవి కూడా ఈమె చేతిలో లేవు. ప్రియాంకకు అవకాశాలు లేకుండా ఒక పిఆర్ టీమ్ చేస్తోందని .. గతంలో తన ప్రాజెక్టుల కోసం ప్రముఖ పిఆర్ టీమ్ ఏజెన్సీ తో ప్రియాంక మోహన్ చేతులు కలిపింది. అయితే ఆ పిఆర్ టీమ్ సమంత, విజయ్, అట్లీ, కీర్తి సురేష్, పూజా హెగ్డే మరి కొంతమంది దర్శక హీరోలకు తరపున టీమ్ గా పని చేసిందట.
ఆ ఏజెన్సీ తో కొన్ని రోజులపాటు ట్రావెల్ చేసిన ప్రియాంక కొన్ని కారణాల చేత ఆ ఏజెన్సీ పనితీరు నచ్చక డీల్ క్యాన్సిల్ చేసుకున్నదట. దీంతో ఈమె డీల్ క్యాన్సిల్ చేసుకోవడంతో గిల్టీగా ఫీలైన పిఆర్ ఏజెన్సీ ఆమె పైన ఎక్కువగా నెగెటివిటీ క్యాంపెయిన్ చేయడం జరుగుతోందట. ఇందుకు సంబంధించి కోలీవుడ్ లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి ప్రియాంక అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈమె పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ సృష్టించి ఆమెకు అవకాశాలు చేయాలనుకోవడం తప్పు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.