సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లకు హీరోల స్థాయిలో పారితోషకాలు దక్కుతూ ఉంటాయి. అలా స్టార్ హీరోల స్థాయిలో పారితోషకాలు దక్కాలి అంటే ఆ బ్యూటీ లకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ ముద్దుగుమ్మలకు సూపర్ సాలిడ్ రెమ్యూనరేషన్లు దక్కుతూ ఉంటాయి. ఇకపోతే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో కియార అద్వానీ ఒకరు. ఈమె హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఈమె రామ్ చరణ్ హీరో గా రూపొందిన వినయ విధేయ రామ , గేమ్ చేంజర్ అనే తెలుగు సినిమాల్లో నటించింది. ఈ సినిమాల ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని  ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం కియారా అదిరిపోయే రేంజ్ పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కోసం కియార ఏకంగా 15 కోట్ల పారితోషకం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీ ఏకంగా ఈ సినిమా కోసం 15 కోట్ల పారితోషకం అందుకుంది అనే వార్తలు బయటకి  రావడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజీ వేరే లెవెల్. అందుకే ఈ రేంజ్ పారితోషకం ఈ సినిమాలో పెట్టుకున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ద్వారా కియార అద్వాని కి ఏ రేంజ్ విజయం , ఏ స్థాయి క్రేజ్ దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: