ప్రెసెంట్ తెరకెక్కుతున్న  ప్రాజెక్టులలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 . ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పుకోక తప్పదు . అలాంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు జక్కన్న . బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది . అంతకుముందు వరకు కూడా రాజమౌళి అంటే ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి ..కధ,  కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది . సినిమా కోసం చాలా చాలా టైం తీసుకుంటాడు.


మంచి కంటెంట్ ను అందిస్తాడు . ఈ విధంగానే అనుకుంటారు . అయితే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా జక్కన్న పేరు మారు మ్రోగిపోయేలా ట్రెండ్ అవుతూ వచ్చింది .ప్రెసెంట్ మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా సెట్స్ పై ఉంది.  ఆఫ్రికా అడవుల్లో ఈ సినిమా షూట్ చిత్రీకరించబోతున్నారు . ఈ సినిమా మొత్తం ఒక నిధి కోసం వేటాడి..వెంటాడే కధ అంటూ ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది . నిజానికి ఈ సినిమాలో మొదటిగా హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని అనుకున్నారట.  ఆల్రెడీ సూర్యకి బాహుబలి కథ చెప్పాడు ..రిజెక్ట్ చేసాడు . ఆర్ఆర్ఆర్ స్టోరీ చెప్పారు రిజెక్ట్ చేశారు .

 

ఈ స్టోరీ కూడా ఆయనకే ముందుకు వివరించారట . కానీ ఈసారి కూడా సూర్య రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ వేరే వాళ్ళ ఖాతాలో పడాల్సి వచ్చింది . ఆ తర్వాత ఈ స్టోరీని ఎవరితో చేద్దామా అనగా మహేష్ బాబు పేరు ఫైనలైజ్ చేసారట విజయేంద్రప్రసాద్.  అలా ఈ సినిమా మహేష్ బాబు ఖాతాలోకి వచ్చి చేరింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా సెలక్ట్ అయ్యింది. ఈ సినిమాలో దాదాపు 10 మంది స్టార్స్ ని గెస్ట్ పాత్రల్లో చూపించబోతున్నాడట రాజమౌళి..!

మరింత సమాచారం తెలుసుకోండి: