తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాద ఛాయలు నెలకొన్నాయి.. నిన్నటి రోజున హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తండ్రి మరణ వార్త అటు అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేయగా..ఇప్పుడు తాజాగా పలు చిత్రాలలో విలన్ గా నటించిన బోరు బండ భాను అనే నటుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా తెలుస్తోంది. ఎన్నో చిత్రాలలో ప్రతి నాయకుడి పక్కన గ్యాంగ్లో నటించేవారు. అయితే తన స్నేహితుడు పిలవడంతో గండి కోటకు వెళ్ళిన ఈ నటుడు అక్కడ పార్టీ చేసుకున్నారు.



అయితే అలా పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ నటుడు ప్రయాణించే కారు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే నటుడు మృతి చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలియదు కానీ.. ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఈ నటుడు తన స్నేహితులతో సరదాగా గడపడం కోసం గండికోటకు వచ్చానని తెలుపుతూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో అయితే షేర్ చేశారు. అయితే అదే రోజు ఈ నటుడు మృత్యువాత పడ్డారు.


నటుడు భాను మరణం పట్ల అతని స్నేహితులతో పాటు ప్రతినాయక పాత్రలు పోషించిన పలువురు నటులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు. నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ నటుడు మరణ వార్త విని పలువురి సిని ప్రముఖులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.. ఇక ఆయన సన్నిహీతులు , స్నేహితులు భాను తమతో  చాలా ఆనందంగా సమయాన్ని గడిపే వారని ఎంతో మంచి స్నేహితుడిని కోల్పోయామంటూ భాగుద్వేగానికి లోనవుతున్నారు. దీంతో భాను మృతితో తెలుగు సినీ పరిశ్రమలో మరో నటుడిని కోల్పోయింది. నటుడు భాను ఆత్మకి శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ కారు ప్రమాదానికి గల కారణాలను సైతం అధికారులు తెలియజేస్తారని చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: