ఏంటి మెగాస్టార్ చిరంజీవి పింఛన్ తీసుకుంటారా.. ఆయన ఎందుకు పెన్షన్ తీసుకుంటారు...అది కూడా రెండు చోట్లనా అని ఆశ్చర్యపోతారు ఈ విషయం తెలిసిన చాలామంది.మరి ఇంతకీ చిరంజీవి పెన్షన్ సంగతేంటి అనేది చూస్తే.. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అయితే రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిస్తే ప్రభుత్వం నుండి పెన్షన్ అనేది అందుతుంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేగా ఉంటూనే కేంద్రమంత్రి,మంత్రి వంటి పదవులు పొందినప్పుడు రెండు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారట. అలాంటి లిస్టులో ప్రస్తుతం గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు, చిరంజీవి వంటి ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తుంది.. 

అయితే దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా ఇలాంటి ప్రముఖులు ఇలా రెండు పెన్షన్లు తీసుకోవడం అనేది సబబు కాదు అనేది విశ్లేషకుల మాటలు.. అయితే మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకోవడం అనేది పక్కన పెడితే రెండు సార్లు పెన్షన్ తీసుకోవడం అనేదాని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇలాంటి దుబారా ఖర్చులు పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కొరకు ఆలోచించాలని అంటున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ మాజీ ఎంపీ,ఎమ్మెల్యేలుగా పెన్షన్లు తీసుకుంటున్న లిస్టును తయారు చేసింది. ఇందులో చాలా మంది ప్రముఖులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారట. అటు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా రెండు పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తుపట్టారు. అలా చిరంజీవి,నాదెండ్ల భాస్కర్,అశోక్ గజపతిరాజు,టీజీ వెంకటేష్ వంటి ప్రముఖులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నట్టు బయట పెట్టారు.
అయితే వీళ్ళు తీసుకునే రెండు పెన్షన్లు నేరమని చెప్పలేము.కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వీళ్లు దాన్ని గ్రహించి ఓకే పెన్షన్ ని పొందాలని అంటున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయనకు వచ్చే పెన్షన్ ఒక లెక్క కాదు.కానీ ఒక పెన్షన్ తీసుకుంటే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి పెన్షన్లు తీసుకునే వారిలో మార్పులు చేర్పులు చేసి ఒకే పెన్షన్ వచ్చేలా చేయడం మంచిదని అంటున్నారు. మరి చూడాలి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెన్షన్ పై దృష్టి సారిస్తారా లేదా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: