
కానీ క్యాన్సిల్ అయిపోయింది . ఆ మూవీ మరేంటో కాదు "వకీల్ సాబ్". పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మరి ముఖ్యంగా లేడీస్ కి బాగా కనెక్ట్ అయిన సినిమా. మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఈ సినిమాల్లో బాగా చూపించారు డైరెక్టర్.తమపై లైంగిక వేధింపులకు గురైన ముగ్గురు యువతులు న్యాయం కోసం పోరాడతారు. ఈ సందర్భంలో వారి తరఫున వాదించే వకీల్‌గా పవన్ కల్యాణ్ (అడ్వొకేట్ సత్య దేవ్ పాత్రలో) వచ్చి, వారి కోసం న్యాయ పోరాటం చేస్తాడు. సినిమా ప్రధానంగా "నో అంటే నో" అనే సందేశాన్ని చాటుతుంది.
ఈ సినిమాలో అంజలి, నివేద థామస్ , అనన్య నాగళ్ళ నటించారు . అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రలో నటించి మెప్పించారు. అంతేకాదు శృతిహాసన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా కనిపిస్తుంది. నిజానికి ఈ రోల్ లో ముందుగా శృతిహాసన్ కన్న సాయి పల్లవి ని అనుకున్నారట . కానీ సాయి పల్లవి క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట . ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ - సాయి పల్లవి కలిసి నటిస్తే చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఆ ఛాన్స్ వచ్చిన సాయి పల్లవి మిస్ చేసుకుంది . కేవలం పవన్ కళ్యాణ్ తోనే కాదు . చిరంజీవితో భోళాశంకర్ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది . కధ, కంటెంట్ లో ఆమెకు ప్రాధాన్యం లేకపోతే ఎలాంటి రోల్స్నైనా సరే రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి..!