
జవాన్‌లోని "విజయ్" పాత్రకు ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఎమోషనల్‌గా మామూలే. అలాంటి పాత్రల్లో షారుఖ్ ను ఎన్నిసార్లు చూశామంటే లెక్కేయలేం. కానీ ఇదే ఏడాది ఇతర భాషల్లో వచ్చిన సినిమాల్ని చూసుకుంటే అసలు అసమాన నటి శక్తుల్ని మనం చూస్తాం. ప్రత్యేకించి మలయాళంలో "ది గోట్ లైఫ్" చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రదర్శించిన నటన అనన్యసామాన్యం. నజీబ్ అనే పాత్రలో ఆయన్ను చూస్తే అది నటన కాదు, అది జీవితం. బానిసబతుకును తాను ఒంటరిగా మోసుకుంటూ 31 కిలోల బరువు తగ్గి నటించడం మాటలు కాదు. కెమెరా ముందున్న ప్రతి సన్నివేశం లో అతడి మౌనమే పెద్ద ఎమోషన్‌గా కనిపించింది. అలాగే తమిళంలో "తంగలాన్" చిత్రంలో విక్రమ్ చేసిన పాత్ర కూడా ఒక క్లాసిక్. శారీరకంగా, భావోద్వేగపరంగా ఇంతవరకూ చూసినంత శ్రమ ఆయన పెట్టారు.
విక్రమ్‌కు కూడా ఇది పర్ఫెక్ట్ నేషనల్ అవార్డు విన్నింగ్ రోల్ అని సౌత్ జనమే కాదు, నార్త్ ఇండియాలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరి అద్భుత నటనల్ని పక్కనబెట్టి… జవాన్ లాంటి మాస్ మసాలా సినిమానికి షారుఖ్‌కు అవార్డు ఇచ్చారంటే అది కేవలం స్టార్ డమ్‌కి తలవంచిన నిర్ణయంగా జనాలు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక అవార్డును ఎవరు గెలుచుకున్నారన్నది కాదు… గొప్ప నటనను గుర్తించాల్సిన బాధ్యతను జాతీయ అవార్డు నిర్వాహకులు మరిచారనే విమర్శలకు ఇది బలమైన ఆధారం అవుతోంది. ఇక పృథ్వీరాజ్ లాంటి నటులకు గుర్తింపు ఇవ్వలేకపోతే… అవార్డుల విలువే ఏముంటుందన్న ప్రశ్నతో చాలామంది గట్టిగా నిలదీస్తున్నారు!