
కింగ్ డమ్' చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మరోసారి సఫలమయ్యారు. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 53 కోట్ల రూపాయల మార్క్‌ను దాటడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
సినిమాకు వస్తున్న విశేష స్పందనను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో 'కింగ్ డమ్' మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విజయం చిత్ర యూనిట్‌తో పాటు, విజయ్ దేవరకొండ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా ప్రస్తుతం సరైన ట్రాక్ లో వెళ్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాతో సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండకు ఇతర భాషల్లో సైతం క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. విజయ్ దేవరకొండ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు