రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమా సుమారుగా రూ.370 కోట్ల  రూపాయలతో సన్ పిక్చర్ బ్యానర్స్ పై తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్  తదితర నటి నటులు నటించారు. నిన్నటి రోజున ట్రైలర్ కూడా విడుదల చేయగా అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నిన్నటి రోజున ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా చేశారు చిత్ర బృందం.


ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. కూలి చిత్రానికి డైరెక్టర్ లోకేష్ కనకరాజె హీరో అని.. అనిరుధ్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక రాక్ స్టార్ అంటూ తెలిపారు. నటుడు సత్యరాజ్ కు తనకు భావజాల విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తన మనసులో ఉండే ఏదైనా విషయాన్ని బహిరంగంగానే మాట్లాడే వ్యక్తి అంటూ సత్యరాజ్ గురించి రజనీకాంత్ ప్రశంసించారు.. ఇలాంటివారిని నమ్మవచ్చు కానీ ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకునే వారిని అసలు నమ్మకూడదంటూ తెలియజేశారు.


లోకేష్ కనకరాజు మొదట కథ చెప్పినప్పుడు ఇందులో నేను విలన్ అనే సీక్రెట్ ని బయటపెట్టారని తెలిపారు. మా ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఒక సరికొత్త తుఫాను సృష్టిస్తుందంటూ రజనీకాంత్ తెలియజేశారు.నాగార్జున ఈ వయసులో కూడా ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటి అని అడగగా అదంతా వ్యాయామం వల్లే సార్ అంటూ నాగార్జున చెప్పారని తెలిపారు. నాగార్జున గారి నటన ఇందులో చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.. చిన్న వయసులో నా మిత్రుడు అయిన రాజ్ బహదూర్ తనకి ఒక గోల్డ్ చైన్ వేసి నువ్వు సినిమాలలో నటిస్తున్నావని చెప్పాడు..అందుకే తాను ఇక్కడ ఉన్నానని తన మిత్రుడు చేసిన సహాయం మరువలేనిది అంటూ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: