టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని ఒక‌ తాగుబోతు వైద్యుడి కథే అర్జున్ రెడ్డి. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్ తో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం 2017లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.


ఇప్పటికీ అర్జున్ రెడ్డికి కల్ట్ ఫాన్స్ ఉన్నారంటే అప్పట్లో ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యున‌రేషన్ ఎంతో తెలిస్తే.. అస్సలు నమ్మలేరు.


డబుల్ ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టిన ఈ సినిమాకు విజయ్ తీసుకున్న పారితోషికం కేవలం రూ. 5 లక్షలు. ఈ విష‌యాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో విజ‌య్ స్వ‌యంగా వెల్ల‌డించ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇక‌పోతే అర్జున్ రెడ్డి సినిమాకు గానూ వ‌చ్చిన బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును విజ‌య్ వేలం వేయ‌గా.. రూ. 25 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఆ అమౌంట్ ను మంచి ప‌నుల‌కు ఉప‌యోగించాన‌ని విజ‌య్ పేర్కొన్నాడు. కాగా, అప్ప‌ట్లో రూ. 5 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ విజ‌య్‌.. ప్ర‌స్తుతం ఒక్కో మూవీకి కోట్ల‌లో ఛార్జ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: