- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఈ నెలలో వస్తున్న సినిమాలలో మంచి బజ్ ఉన్న‌ సినిమా కూలి. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ - నాగార్జున - అమీర్ ఖాన్ - ఉపేంద్ర లాంటి హేమహేమీలు ఉన్నారు. ఇప్పటికే వచ్చిన పూజ హెగ్డే పాట బాగా వైరల్ అయింది. తెలుగు థియేటర్ హక్కులు రు. 44 కోట్లకు అమ్మారు. సినిమా మీద ఆసక్తి ఆ స్థాయిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ట్రైలర్ వచ్చింది. కానీ ఈ ఆసక్తిని బ‌జ్ ను తగ్గించే ట్రైలర్ ఉంది తప్ప పెంచేలా లేదు. మరి ట్రైలర్ ఎందుకు అలా కట్ చేశారు .. లో ప్రొఫైల్ మెయింటెన్ చేద్దాం అనుకున్నారా .. అండర్ ప్లే చేశారా ? అని సర్ది చెప్పుకోవడానికి అవకాశం తక్కువే. ఏ మేకర్ అయినా సినిమాపై హైప్‌ పెంచాలని అనుకుంటారు తప్ప తగ్గించాలని అనుకోరు కానీ కూలీ ట్రైలర్ వేరే సమస్య వచ్చింది అనుకోవాలి.


సినిమా లో స్పాన్ ఎక్కువ‌. పెద్ద పెద్ద తార‌గ‌ణం ఉంది. అంద‌రిని చూపించాలి.. హీరో , హీరోయిన్ల‌ను చూపించాలి. ప్ర‌తి ఒక్క‌రికి ఒక్క షాట్ అయినా ఇవ్వాలి. అందుకే కూలీ ట్రైల‌ర్ లో పూర్తిగా ఎవ్వ‌రూ హైలెట్ కాలేదు. అందుకే చాలా మంది డిజ‌ప్పాయింట్ అయ్యారు. అంద‌రికి త‌లో షాట్ వేసుకుంటూ వెళ్లారు. అందుకే కూలీ ట్రైల‌ర్ ప‌ట్ల అంద‌రూ పూర్తిగా శాటిస్ పై కాలేదు. అంత‌కు మించి కూలీ ట్రైల‌ర్ విష‌యంలో కంప్లైంట్ ఏం ఉండ‌క‌పోవ‌చ్చు. రేపు థియేట‌ర్ల‌లో లోకేష్ అంద‌రిని పూర్తిగా శాటిస్ పై చేస్తార‌నే అనుకోవాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: