మనందరికీ తెలిసిందే.. అనిల్ రావిపూడి చాలా డిఫరెంట్ గా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా డైరెక్టర్ లు కోట్ల బడ్జెట్ పెట్టి బిగ్ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే వాళ్ల సినిమాల కన్నా కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాలే అభిమానులను  బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా అభిమానులను ఎంతలా ఆకట్టుకునింది అన్న విషయం అందరికీ తెలుసు .


ఐశ్వరరాయ్ రాజేష్, మీనాక్షి చౌదరిల పర్ఫామెన్స్ వేరే లెవెల్ . కాగా ఇప్పుడు అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవిని డైరెక్టర్ చేస్తున్నారు . ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది . అంతేకాదు క్యాధరిన్ ధెరిస్సా సెకండ్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ పాత్రలో అలరించబోతున్నాడు హీరో వెంకటేష్ . దీనికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఏంటి..? అనేది బాగా హైలైట్ గా మారింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ ఎపిసోడ్ లో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో వెంకటేష్ మనకు కనిపించబోతున్నారట .



చిరంజీవి - నయనతారల మధ్య మధ్య వర్తిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ చేసే పెర్ఫార్మెన్స్ పిక్స్ కామెడీ లెవల్ ని తీసుకెళ్తుంది అంటున్నారు మూవీ మేకర్స్ . ఈ పాత్ర సినిమా మొత్తంలోనే చాలా కీలకమని .. అందుకని అనిల్ రావిపూడి కి ఎంతో కలిసి వచ్చిన వెంకటేష్ ఈ పాత్ర కోసం చూస్ చేసుకున్నాడు అన్న టాక్ నడుస్తుంది.  అంతేకాదు ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ .."ఈ సినిమా పూర్తి సాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చేసింది అంటూ చెప్పాడు ". దీంతో సినిమాపై మరింత హైప్  పెంచేసుకున్నారు అభిమానులు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అంటూ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా గతంలో మగధీర సినిమా చిరంజీవి ని ఎలా చూపించాడో రాజమౌళి..ఇప్పుడు అనిల్ అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: