
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల కాలంలో పెద్ద హీరోలు యేడాదికి .. రెండేళ్ల కు ఒక సినిమాలు చేస్తున్నారు. ఒక్కోసారి పెద్ద హీరో ల సినిమాలు రావడానికి ఏకంగా రెండేళ్లకు పైగా టైం పట్టేస్తోంది. దీంతో అప్పటి వరకు ఆ హీరోల అభిమానులు తమ హీరో సినిమా కోసం వెయిట్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఆ హీరోలు నటించిన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీ రిలీజ్ లోనూ పాత హిట్ సినిమాలు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.
రీ రిలీజ్ లో టాలీవుడ్ నుంచి వరల్డ్ వైడ్ గా అత్యధిక గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాల లిస్ట్ చూస్తే టాప్ - 5 సినిమా లలో మహేష్ బాబు నటించిన సినిమా లే ఏకంగా 4 ఉన్నాయి. టాప్ - 5 లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఉంది. ఆ తర్వాత నాలుగు సినిమాలు మహేష్ వే కావడం విశేషం. అందులోనూ తాజాగా రీ రిలీజ్ అయిన అతడు సినిమా కూడా టాప్ 5 లోకి వచ్చేసింది.
వరల్డ్ వైడ్ గా హయ్యస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన టాప్ - 5 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే
1.గబ్బర్‌సింగ్
2. ఖలేజా
3. మురారి
4. బిజినెస్ మేన్
5. అతడు
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు